మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Bhadrakali Stuti – శ్రీ భద్రకాళీ స్తుతిః
బ్రహ్మవిష్ణు ఊచతుః |
నమామి త్వాం విశ్వకర్త్రీం పరేశీం
నిత్యామాద్యాం సత్యవిజ్ఞానరూపామ్ |
వాచాతీతాం నిర్గుణాం చాతిసూక్ష్మాం
జ్ఞానాతీతాం శుద్ధవిజ్ఞానగమ్యామ్ || 1 ||
పూర్ణాం శుద్ధాం విశ్వరూపాం సురూపాం
దేవీం వంద్యాం విశ్వవంద్యామపి త్వామ్ |
సర్వాంతఃస్థాముత్తమస్థానసంస్థా-
-మీడే కాళీం విశ్వసంపాలయిత్రీమ్ || 2 ||
మాయాతీతాం మాయినీం వాపి మాయాం
భీమాం శ్యామాం భీమనేత్రాం సురేశీమ్ |
విద్యాం సిద్ధాం సర్వభూతాశయస్థా-
-మీడే కాళీం విశ్వసంహారకర్త్రీమ్ || 3 ||
నో తే రూపం వేత్తి శీలం న ధామ
నో వా ధ్యానం నాపి మంత్రం మహేశి |
సత్తారూపే త్వాం ప్రపద్యే శరణ్యే
విశ్వారాధ్యే సర్వలోకైకహేతుమ్ || 4 ||
ద్యౌస్తే శీర్షం నాభిదేశో నభశ్చ
చక్షూంషి తే చంద్రసూర్యానలాస్తే |
ఉన్మేషాస్తే సుప్రబోధో దివా చ
రాత్రిర్మాతశ్చక్షుషోస్తే నిమేషమ్ || 5 ||
వాక్యం దేవా భూమిరేషా నితంబం
పాదౌ గుల్ఫం జానుజంఘస్త్వధస్తే |
ప్రీతిర్ధర్మోఽధర్మకార్యం హి కోపః
సృష్టిర్బోధః సంహృతిస్తే తు నిద్రా || 6 ||
అగ్నిర్జిహ్వా బ్రాహ్మణాస్తే ముఖాబ్జం
సంధ్యే ద్వే తే భ్రూయుగం విశ్వమూర్తిః |
శ్వాసో వాయుర్బాహవో లోకపాలాః
క్రీడా సృష్టిః సంస్థితిః సంహృతిస్తే || 7 ||
ఏవంభూతాం దేవి విశ్వాత్మికాం త్వాం
కాళీం వందే బ్రహ్మవిద్యాస్వరూపామ్ |
మాతః పూర్ణే బ్రహ్మవిజ్ఞానగమ్యే
దుర్గేఽపారే సారరూపే ప్రసీద || 8 ||
ఇతి శ్రీమహాభాగవతే మహాపురాణే బ్రహ్మవిష్ణుకృతా శ్రీ భద్రకాళీ స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.